తెలంగాణ

telangana

ETV Bharat / state

జేసీబీ సాయంతో కరోనా మృతదేహం తరలింపు.. భయాందోళనలో గ్రామస్థులు - జేసీబీ సాయంతో కరోనా మృతదేహం తరలింపు.. భయాందోళనలో గ్రామస్థులు

కరోనాతో బంధాలు, అను బంధాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. వైరస్​ సోకి చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు సైతం ముందుకు రావడం లేదు. చివరి మజిలీకి దూరంగా ఉంటూ.. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చివరికి అధికారులే అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. ఇలాంటి ఓ ఘటనే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గొల్లగూడెంలో చోటుచేసుకుంది.

జేసీబీ సాయంతో కరోనా మృతదేహం తరలింపు.. భయాందోళనలో గ్రామస్థులు
జేసీబీ సాయంతో కరోనా మృతదేహం తరలింపు.. భయాందోళనలో గ్రామస్థులు

By

Published : Sep 4, 2020, 12:39 PM IST

మహబూబాబాద్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. మరణాలు సైతం అదే స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బయ్యారం మండలం గొల్లగూడెంలో కరోనా బారినపడిన వీరన్న అనే ఓ వ్యక్తి గురువారం మరణించాడు. మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా అధికారులు మంచంపై పడి ఉన్న శవాన్ని జేసీబీ సాయంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహపురం గ్రామ శివారులోని శ్మశాన వాటిక పక్కన పాతి పెట్టారు.

మరోవైపు ఈ ఘటనతో లక్ష్మీ నరసింహపురం గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వేరే గ్రామానికి చెందిన మృతదేహాలను.. తమ గ్రామం పక్కన పాతి పెట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పైపైనే పాతిపెడుతున్నారని, వర్షం పడితే మృతదేహం తేలి.. కుక్కలు పీక్కు తినే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ఇదీచూడండి.. పేరొకటి.. పని నడిచేదొకటి... పరిశ్రమల భూముల్లో ఇతర కార్యకలాపాలు

ABOUT THE AUTHOR

...view details