మహబూబాబాద్‌లో ఓ కాలనీలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు శీతల పానియాలు వదిలివెళ్లటం వల్ల స్థానికుల ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాటిన స్వాధీనం చేసుకున్నారు.
కాలనీలో శీతల పానీయాలు..భయపడుతున్న ప్రజలు - cool Drinks Bottles Caused in Mahabubabad district
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో మహబూబాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు శీతలపానియాలను ఇళ్ల దగ్గర వదిలివెళ్లటం కలకలంగా మారింది. దీనివల్ల స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.
శీతల పానియాలు చూసి భయపడుతున్న ప్రజలు
ఒకవైపు కరోనా వ్యాధి ప్రబలుతుంటే, మరో వైపు సీసాల కలకలం ఏంటని స్థానికుల భయపడుతున్నారు.
ఇవీ చూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం