తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు భూముల్లో ట్రెంచింగ్​.. రైతులు, అధికారులకు మధ్య ఘర్షణ - disputes in fallow lands

మహబూబాబాద్ జిల్లాలో మరోసారి అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ తలెత్తింది. వివాదాస్పద పోడు భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని పైఅధికారులు హెచ్చరించినా స్థానిక అధికారులు ట్రెంచ్​లు కొట్టేందుకు యత్నించడం వల్ల స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

trenching in disputes lands
పోడు భూముల్లో ట్రెంచింగ్​

By

Published : Mar 6, 2021, 7:19 PM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండా శివారులో పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్​లు కొట్టేందుకు యత్నించగా రైతులు వారిని అడ్డుకున్నారు. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ రైతు.. గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రెండు రోజులుగా అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వివాదాస్పద పోడు భూముల్లోకి అటవీశాఖ అధికారులు వెళ్లవద్దంటూ ఎమ్మెల్యే, మంత్రులు, అటవీశాఖ పై అధికారులు చెప్పినా స్థానిక అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రతిరోజూ పోడు భూముల్లోకి వచ్చి బలవంతంగా ట్రెంచ్​లు కొడుతూ గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గూడూరు మండల సమాచార హక్కు కమిషన్ అధ్యక్షుడు మంగీలాల్ ఆరోపించారు. స్థానిక అటవీశాఖ అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:దిల్లీలో ధర్నాలు చేసేది దళారులే: అర్వింద్

ABOUT THE AUTHOR

...view details