తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించిన ఓ ప్రైవేట్​ స్కూల్

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు పాఠశాల వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా... పీడీఎస్​యూ విద్యార్థి సంఘం అడ్డుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Mahabubabad District
Mahabubabad District

By

Published : Apr 24, 2021, 3:00 PM IST

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు విద్యా సంస్థ… విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా… పీడీఎస్​యూ విద్యార్థి సంఘం అడ్డుకుని జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేసింది.

ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హొలీ ఏంజెల్స్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం 7, 8, 9 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలను.. ఫీజును తీసుకొని పాఠశాలకు రండి… వార్షిక పరీక్షలు నిర్వహించి పైతరగతులకు ప్రమోట్ చేస్తాం అని సమాచారం అందించారు. కొంత మంది పిల్లలు పాఠశాలకు వచ్చి తరగతి గదులలో పరీక్షలు రాస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పీడీఎస్​యూ విద్యార్థి సంఘం పాఠశాలకు చేరుకొని పరీక్షలను అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించింది. జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర్ శర్మకు సమాచారం అందించారు. డీఈఓ పాఠశాలకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల నుంచి పరీక్ష పేపర్​లను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details