తెలంగాణ

telangana

ETV Bharat / state

కాల్వకు గండి కొట్టారు.. పంట తడిసి రైతన్నల ఘోష - srsp project

పంట పొలాలు చేతికందే దశలో ధాన్యం నీట మునిగిపోయి రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ నీరు అకాల వర్షంతో వచ్చింది కాదు అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందని ఆరోపించారు.

కాల్వకు గండి కొట్టారు.. పంట తడిసి రైతన్నల ఘోష

By

Published : Nov 11, 2019, 1:20 PM IST

మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారంలోని జగ్యా తండా వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు.. గ్రామానికి చెందిన కొందరు జేసీబితో గండి పెట్టారు. గ్రామ శివారులోని గాజుల కుంట, ముత్యాల చెరువును నింపేందుకు గండి పెట్టడం వల్ల సమీపంలోని పంటలు జలమయమయ్యాయి. తమ పొలాలు చేతికందే దశకు వచ్చాయని... వారం రోజులు ఆగాక గండి పెట్టాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరినప్పటికీ వినకుండా రాత్రికి రాత్రే గండి పెట్టారని ఆరోపించారు.

కాల్వకు గండి కొట్టారు.. పంట తడిసి రైతన్నల ఘోష
గాజులకుంట నిండితే దిగువన ఉన్న పంట పొలాలకి నీరు చేరి... మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని.. గండిని పూడ్చివేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details