తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల ఆందోళనలకు మద్దతుగా వామపక్షాల నిరసనలు - మహబూబాబాద్​లో వామపక్షాల నిరసన

దిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా మహబూబాబాద్​ జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నెల 8న చేపట్టబోయే భారత్ బంద్​ను విజయవంతం చేయాలని కోరారు.

communists protest in mahabubabad supporting to delhi farmers agitations
రైతుల ఆందోళనలకు మద్దతుగా వామపక్షాల నిరసనలు

By

Published : Dec 5, 2020, 10:31 PM IST

దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లాలో వామపక్షాలు నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకంగా ఉన్న చట్టాలు రైతులకు తీవ్ర నష్టం చేస్తాయని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 8న దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్​ను విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:రైతు దీక్ష: కొలిక్కిరాని చర్చలు- 9న మరో భేటీ

ABOUT THE AUTHOR

...view details