తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్​ - ఉన్నత పాఠశాలను సందర్శించిన వీపీ గౌతమ్​

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పర్యటించారు. మోద్గులగూడెంలోని జడ్పీ ఉన్నత పాఠాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులను ప్రశ్నించి వారి సామర్థ్యాలను పరీక్షించి అభినందించారు.

Collector vp gowtam visit modugulagudem zp school
పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్​

By

Published : Feb 18, 2021, 3:26 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పర్యటించారు. మోద్గులగూడెంలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ప్రశ్నించారు. వివిధ ప్రశ్నలు అడిగి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు.

విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలన్నారు. నేత్ర సమస్యతో బాధపడుతున్న విద్యార్థికి ఆపరేషన్‌ చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కందికొండలో ఉపాధి హామీ పనులు, కురవిలో పల్లెప్రగతి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :నా కొడుకు హత్యలో పెద్దోళ్ల హస్తముంది: కిషన్ రావు

ABOUT THE AUTHOR

...view details