తెలంగాణ

telangana

ETV Bharat / state

'గుంపులు, గుంపులుగా తిరిగితే... కేసులే'

తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్​ల పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లోని దుకాణాల్లో 50 శాతం దుకాణాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సరి, బేసి పద్దతుల్లో దుకాణాలు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

collector visited vpmahaboobabad
'గుంపులు, గుంపులుగా తిరిగితే... కేసులే'

By

Published : May 7, 2020, 9:01 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీ కేటగిరీలో ఉన్న దుకాణాలకు సరి, బేసి పద్ధతుల్లో తెరుచుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డిలు కలిసి ఎవరెవరు ఏప్పుడెప్పుడు దుకాణాలు తెరవాలో వ్యాపారస్థులకు వివరించారు. ఓ కిరాణా దుకాణంలో రద్దీ బాగా ఉండటం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం చూసిన అధికారులు వారి దగ్గరకు వెళ్లి భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా ఇప్పటివరకు గ్రీన్ జోన్​లో ఉందని... ఆంక్షలను సడలించడం వల్ల అంతా ఒక్కసారి బయటకు వచ్చి, గుంపులు, గుంపులుగా చేరితే వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని లేనిపక్షంలో జరిమానా విధిస్తామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న బార్డర్ చెక్ పోస్టులను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, ఆర్డీవో కొమరయ్యలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

ABOUT THE AUTHOR

...view details