తెలంగాణ

telangana

ETV Bharat / state

'జనరిక్​'తో తక్కువ ధరకే నాణ్యమైన మందులు: కలెక్టర్ - జనరిక్‌ ఫార్మసీ

మహబూబ్‌బాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జనరిక్‌ మెడికల్‌ దుకాణాన్ని కలెక్టర్‌ గౌతమ్‌ ప్రారంభించారు. జనరిక్‌ ఫార్మసీ ద్వారా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ తక్కువ ధరలో మందులు అందిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

mahabubabad, generic pharmacy, collector gowtham
జనరిక్‌ ఫార్మసీ, మహబూబాబాద్‌, కలెక్టర్‌ గౌతమ్‌

By

Published : Feb 4, 2021, 9:24 AM IST

ఖరీదైన, నాణ్యమైన కంపెనీల మందులను జనరిక్ ఫార్మసీ తక్కువ ధరకే అందిస్తోందని మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు.

వైద్యం ఖర్చు నానాటికీ పెరుగుతుండటంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.. జనరిక్ ఫార్మసీ ద్వారా మందులను తక్కువ ధరకు అందించేందుకు ముందుకు రావడం అభినందించదగిన విషయమని కలెక్టర్‌ కొనియాడారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలు ఈ మందులను కొనుగోలు చేసి ఖర్చును తగ్గించుకోవాలని సూచించారు. మెడికల్‌ దుకాణాల్లో విక్రయిస్తోన్న మందుల కన్నా జనరిక్ మందులు ఎంత తక్కువ ధరకు లభిస్తాయో తెలిసే విధంగా ప్రజలకు వివరించి చెప్పాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ ప్రసాద్, వైస్ ఛైర్మన్ డాక్టర్. నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఎన్‌సీసీ డైరెక్టరేట్​కు గవర్నర్​ తమిళిసై అభినందనలు

ABOUT THE AUTHOR

...view details