తెలంగాణ

telangana

ETV Bharat / state

హోం ఐసోలేషన్​లో కరోనా బాధితులను పరామర్శించిన కలెక్టర్​ - మహబూబూబాబాద్​లోని కరోనా ఐసోలేషన్​ ఇళ్లను కలెక్టర్​ సందర్శించారు

మహబూబాబాద్​లోని పలు ప్రాంతాల్లో కరోనా బారినపడి హోంఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్న కుటుంబాలను కలెక్టర్​ గౌతమ్ పరామర్శించారు. వారి ఆరోగ్యపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భయపడవద్దని భరోసా కల్పించారు.​

collector goutham visit covid houses in mahabubabad
హోం ఐసోలేషన్​లోని కరోనా బాధితులను పరామర్శించిన కలెక్టర్​ గౌతమ్​

By

Published : Jul 29, 2020, 7:05 PM IST

కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణంలోని పలు వీధుల్లో కలెక్టర్​ గౌతమ్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ హోమ్ ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భయపడవద్దని తాము ఉన్నామని భరోసా కల్పించారు. వైద్య, రెవెన్యూ అధికారులతో కలిసి కృష్ణ కాలనీ, కంకర బోర్డ్, ఇందిరా గ్రౌండ్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆయన కలియతిరిగారు.

కరోనా విస్తరించకుండా తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ బారిన పడిన వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రోగగ్రస్తులకు అండగా ఉండాలని కోరారు.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్

ABOUT THE AUTHOR

...view details