మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్.. అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సమయంలో మాస్క్ ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న మహావీర్ హనుమాన్ స్వీట్ షాప్‌ను సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
పరిశీలన..
ఇందిరాగాంధీ సెంటర్ నుంచి మూడు కోట్ల సెంటర్ వరకు రోడ్ల విస్తరణ పనులను, మూడు కోట్ల నుంచి కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో నిర్మిస్తున్న నూతన గృహాలు.. డ్రైనేజీని పరిశీలించారు. అనంతరం అధికారులను పలు వివరాలపై ఆరా తీశారు. అనంతరం శనిగపురంలో మియావాకి పద్ధతిలో నాటిన మొక్కల వనాన్ని సందర్శించారు. వాటిపై అధికారులకు పలు సూచనలు చేశారు.