తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో సీఎం సభకు ఏర్పాట్లు - sabha

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 4న జరిగే కేసీఆర్​ సభా స్థలిని తెరాస నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. భారీ సంఖ్యలో జన సేకరణ చేయాలని మంత్రి ఎర్రబెల్లి స్థానిక నేతలకు సూచించారు.

సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Mar 26, 2019, 11:20 AM IST

Updated : Mar 26, 2019, 12:16 PM IST

సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
ఏప్రిల్​ 4న మహబూబాబాద్​లో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభాస్థలిని మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్​, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులుపరిశీలించారు.

ఎల్లందు వెళ్ళే రహదారిలోని మైదానంలో సభ జరగనుంది. భారీ సంఖ్యలో జనసమీకరణ చేయాలని స్థానిక నేతలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమయం తక్కువ ఉన్నందున వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

Last Updated : Mar 26, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details