మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 21మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 8 లక్షల 42 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆమె అందించారు.
కేసీఆర్ ప్రభుత్వం... పేదల ప్రభుత్వం: ఎంపీ కవిత - మహబూబాబాద్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కేసీఆర్ ప్రభుత్వం పేదల సర్కారని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తెలిపారు. 21మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం... పేదల ప్రభుత్వం: ఎంపీ కవిత
కేసీఆర్ ప్రభుత్వం పేదల సర్కారని ప్రతి పేదవారిని ఆదుకోవడానికే ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
ఇదీ చూడండి:కిట్‌లో రూ.2,800 విలువ చేసే నిత్యావసరాలు, 3 దుప్పట్లు: కేటీఆర్