భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పర్యటించారు. ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎంపీ సీతారాం నాయక్‌కు మళ్లీ టికెట్ ఇస్తున్నారా లేదా అంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. సీతారాం నాయక్ 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ముఖ్యమంత్రి అన్నారని ఎంపీ గుర్తు చేశారు. ఈ నెల 16న ఎంపీ టికెట్‌పై స్పష్టత వస్తుందన్నారు. మళ్లీ టికెట్ వస్తే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కేసీఆర్‌దే తుది నిర్ణయం
తనకు ఎంపీ టికెట్ వస్తుందా... రాదా...అన్నదానిపై తుది నిర్ణయం సీఎందే అన్నారు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులపై ఎంపీ స్పందించారు.
సీతారాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ