కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - cheques issue
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. 267 మంది లబ్ధిదారులకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెక్కులను అందించారు.
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, దంతాలపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్చెక్కులు పంపిణీ చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని 267 మందికి చెక్కులు, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
TAGGED:
cheques issue