తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్​ షాపులో తనిఖీలు - మహబూబాబాద్​ జిల్లా ఔషద నియంత్రణ శాఖ అధికారుల తనిఖీలు

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ మెడికల్‌ షాపులో పోలీసులు, జిల్లా ఔషద నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 45 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా చిల్లంచర్లలో జరిగింది.

అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్​ షాపులో తనిఖీలు
అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్​ షాపులో తనిఖీలు

By

Published : Apr 17, 2020, 8:43 AM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్‌ షాపులో డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ కిరణ్​ కుమార్​, తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి పొందకుండా ఇంట్లో నిల్వ చేసిన 45 రకాల మందులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బాద్యుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details