తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉక్కు కర్మాగారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి : మంత్రి సత్యవతి - మహబూబాబాద్ బయ్యారం ఉక్కు కర్మాగారం

బయ్యారం ఉక్కు కర్మాగారం మంజూరు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర సర్కార్ సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు.

బయ్యారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి : మంత్రి సత్యవతి
బయ్యారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి : మంత్రి సత్యవతి

By

Published : Sep 17, 2020, 7:08 AM IST

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

ఉపాధి మెరుగు.. ఆదాయం ఘనం

కర్మాగారం ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని... ఈ మేరకు స్థానిక నిరుద్యోగ యువతను ఆదుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ఖజనాకు కూడా ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.

అదనపు ఎత్తిపోతలు కావాలి..

ఇల్లెందు, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో దాదాపు లక్ష ఎకరాలకు నీరందించేలా సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వపై అదనపు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలన్నారు.

ఫ్లడ్ బ్యాంక్స్ పనులు పూర్తిగా చేయాలి..

వరంగల్ గ్రామీణ జిల్లా ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరివాహక గ్రామాల్లో వరదలు, భూమి కోతను నివారించేందుకు ఫ్లడ్ బ్యాంక్స్ పనులు పూర్తి స్థాయిలో చేపట్టేలా ఆదేశించాలన్నారు. మున్నేరు వాగుపై హైలెవల్ బ్రిడ్జి మంజూరు, మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తిని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వైద్యశాల సైతం..

మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల ఇస్తామన్న హామీని వేగవంతం చేయాలని సత్యవతి రాఠోడ్ సీఎం కేసీఆర్​ను అడిగారు. తమ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఎడతెరిపిలేని వానలు... తడిసి ముద్దైన హైదరాబాద్

ABOUT THE AUTHOR

...view details