మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన ఓ వైద్యుడు స్థానిక బంక్లో పెట్రోల్ పోయించారు. వాహనం బంక్ నుంచి బయటకు రాగానే కారులో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. అప్రమత్తమైన వైద్యుడు కిందకు దిగాడు. వెంటనే మంటలు కారును చుట్టుముట్టాయి.
కారులో మంటలు... అప్రమత్తమైన చోదకుడు - తెలంగాణ వార్తలు
పెట్రోల్ పోయించి కారు బయటకు పోనివ్వగానే మంటలు చెలరేగిన ఘటన మరిపెడలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ కారు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.
కారులో మంటలు... అప్రమత్తమైన చోదకుడు
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆపేశారు. ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి:కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్