తెలంగాణ

telangana

ETV Bharat / state

లైట్స్​ లేకుండా చీకట్లో 20 కి.మీ. ప్రయాణించిన ఆర్టీసీ బస్సు - మహబూబాబాద్

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 కిలోమీటర్లు హెడ్​లైట్స్​ లేకుండా ఓ ఆర్టీసీ బస్సు చీకట్లో ప్రయాణించింది. దారిలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి తన లైట్స్​తో దారి చూపించాడు. అయితే లైట్స్ లేవని​ అసలు విషయం తెలిసి ప్రయాణికులు ఆ బస్సు డ్రైవర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లైట్స్​ లేకుండా చీకట్లో 20 కి.మీ. ప్రయాణించిన ఆర్టీసీ బస్సు

By

Published : Oct 25, 2019, 12:34 AM IST

లైట్స్​ లేకుండా చీకట్లో 20 కి.మీ. ప్రయాణించిన ఆర్టీసీ బస్సు
మహబూబాబాద్ డిపోకు చెందిన ఏపీ 29 జడ్​ 1442 నెంబరు గల ఆర్టీసీ బస్సు జగద్గిరిగుట్ట నుంచి భువనగిరి, మోత్కురు, తిర్మలగిరి మీదుగా తొర్రూరు​కు బయలుదేదింది. సాయంత్రం భువనగిరి దాటిన తర్వాత పూర్తిగా చీకటి కావడం వల్ల బస్సు హెడ్ లైట్స్ వేసే ప్రయత్నం చేశాడు డ్రైవర్. అయితే లైట్లు రావడంలేదు. చాలా సేపు ప్రయత్నించినా.. ఫలితం లభించలేదు. చేసేదేమి లేక బస్సును అలానే నడుపుకుంటూ బయలు దేరాడు. కొంత దూరం వెళ్ళాక ఇది గ్రహించిన ఓ ద్విచక్ర వాహనదారుడు బస్సు ఆపి వివరాలు తెలుసుకొని బస్సు ముందు తన బైక్​ లైట్​తో దారి చూపించాడు.

ఇలా ద్విచక్రవాహనం వెనుక సుమారు 20 కిలోమీటర్ల ప్రయాణం చేశాక ఆత్మకూర్​లో ఓ మెకానిక్​కు బస్సును చూపించారు. బస్సును పరిశీలించిన మెకానిక్ అవాక్కయ్యాడు. బస్సు లైట్లు పనిచేస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే తాత్కాలిక డ్రైవర్​కు బస్సు లైట్ల స్విచ్ ఎక్కడుందో తెలియదు. ఇది తెలిసి ప్రయాణికులు డ్రైవర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సామర్థ్యానికి మించి ఉన్న ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించారు.

ABOUT THE AUTHOR

...view details