మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య సిబ్బందికి వాసవి నటరాజ వీరభద్ర కోలాటా బృందం అల్పాహారంను పంపిణీ చేశారు. కరోనాతో ప్రజలంతా ఇళ్లు వదిలి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
'పారిశుద్ధ్య సిబ్బందికి అల్పాహారం ఉచితం' - mahabubabad district latest news today
కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వాసవి నటరాజ వీరభద్ర కోలాటా బృందం అల్పాహారంను అందించారు.
'పారిశుద్ధ్య సిబ్బందికి అల్పాహారం ఉచితం'
ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులను వదిలి ప్రజల కోసం పని చేస్తున్న వారికి తమ వంతు సాయంగా అల్పాహారం అందించామని ఆ సంస్థ సభ్యులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నంత వరకు మున్సిపల్ సిబ్బందికి తమ ట్రస్టు ద్వారా రోజూ అల్పాహారం అందిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు