మహబూబాబాద్ జిల్లా బ్రహ్మణపల్లి లక్ష్మీపురంలో ఓ వ్యక్తికి నెల రోజుల క్రితం కరోనా సోకి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. బంధుమిత్రులెవరూ మృతదేహం వద్దకు రాలేదు.
కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్ - బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం సర్పంచ్ షఫియొద్దీన్
కరోనా... బంధాలను బంధుత్వాలను దూరం చేస్తుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తులను బంధువులు చివరి చూపు కూడా చూడడం లేదు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకుండా ముఖం చాటేస్తున్నారు. కన్నవారే....కాటికి రాని ఈ రోజుల్లో గ్రామ సర్పంచ్ అన్నీ తానై అంత్యక్రియలు జరిపించారు.
కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్
గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ షఫియొద్దీన్... మృతదేహాన్ని ట్రాక్టర్లో స్వయంగా స్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.