మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలో బాంబ్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక నెహ్రూ సెంటర్, తొర్రూరు బస్టాండ్, ఎఫ్ఆర్వో సెంటర్లలో అనుమానిత వ్యక్తులను, వస్తువులను తనిఖీలు చేశారు.
మహబూబాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు - Mahabubabad district news
మహబూబాబాద్ పట్టణంలో బాంబ్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పలు ప్రదేశాల్లో అనుమానిత వ్యక్తులను, వస్తువులను తనిఖీ చేశారు.
![మహబూబాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు Bomb squad conducts inspections in Mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9629684-5-9629684-1606060112437.jpg)
మహబూబాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు
అనుమానిత వస్తువులు కనపడితే పోలీసులకు తెలియచేయాలని కోరారు. బాంబ్ స్క్వాడ్ మీద ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, ఆర్ఐ నర్సయ్య, టౌన్ ఎస్సై అరుణ్ కుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సాఫ్ట్వేర్ శారదకు ధ్రువపత్రం అందజేసిన కేటీఆర్