మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో భాజపా ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్ కట్టుకుని వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. భాజపా కార్యకర్తలపై తెరాస దాడులను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
తెరాస తీరును నిరసిస్తూ.. భాజపా మౌనదీక్ష - Telangana news
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై భాజపా నాయకులు మౌనదీక్ష చేపట్టారు. తెరాస దాడులను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
![తెరాస తీరును నిరసిస్తూ.. భాజపా మౌనదీక్ష దంతాలపల్లిలో భాజపా మౌనదీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10469335-385-10469335-1612249232515.jpg)
దంతాలపల్లిలో భాజపా మౌనదీక్ష
వరంగల్లో భాజపా కార్యకర్తలపై దాడులు, అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్ పేర్కొన్నారు. రామమందిర నిర్మాణంపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
- ఇదీ చదవండి: 'ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి'