మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో.. భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి బైక్పై ర్యాలీగా.. ఇంటింటికి వెళ్లి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు.
'సమస్యలపై పోరాటానికి.. ప్రతిపక్షం ఉండి తీరాలి' - భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్
ఉద్యోగాలు, పీఆర్సీలపై పోరాడే సత్తా ఉన్న ప్రేమేందర్ రెడ్డినే ఎమ్మెల్సీగా గెలిపించాలని భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
'సమస్యలపై పోరాటానికి.. ప్రతిపక్షం ఉండి తీరాలి'
ఉద్యోగాలు, పీఆర్సీలపై పోరాడే సత్తా ఉన్న ప్రేమేందర్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని హుస్సేన్ కోరారు. సమస్యలపై పోరాటానికి.. ప్రతిపక్షం ఉండి తీరాలని వివరించారు. ఈ ప్రచారంలో జిల్లా భాజపా అధ్యక్షుడు రామచందర్ రావు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు: చిన్నారెడ్డి