తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా నేతలంతా ఇకపై ఐఫోన్లే వాడాలన్న బండి సంజయ్.. ఎందుకో తెలుసా..? - తాజా వార్తలు

BJP leaders meeting in state party office: తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకే భాజపా నేతలు అందరూ ఐఫోన్లే వాడాలని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు.

All BJP leaders should use iPhones from now on
భాజపా నేతలంతా ఇకపై ఐఫోన్లే వాడాలి

By

Published : Dec 16, 2022, 7:21 PM IST

BJP leaders meeting in state party office: భాజపా నేతలంతా ఐఫోన్లే వాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేస్తోందని నేతలకు తెలియకుండానే ప్రభుత్వానికి చాలా విషయాలు తెలిసిపోతున్నాయని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా నీచమైన పనిగా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త ఐఫోన్లు కొనుక్కోవాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details