తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధిక విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి' - అధిక విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి: భాజపా నాయకుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి

మహబూబాబాద్​లోని ట్రాన్స్​కో ఎస్ఈ కార్యాలయం ముందు భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. విద్యుత్ బిల్లులలో స్లాబ్​ల విధానం రద్దు చేయాలని భాజపా నాయకుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అధిక విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కోరారు.

Bjp Dharna in front of Trans Co SE office in Mahabubabad
'అధిక విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి'

By

Published : Jun 15, 2020, 5:37 PM IST

విద్యుత్ బిల్లుల స్లాబ్​ల విధానం రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆందోళన నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్​కో ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అధిక విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని భాజపా నాయకుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి అన్నారు. విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఛార్జీల రూపంలో పెనుభారం మోపిందని ఆరోపించారు.

బిల్లులను కట్టే పరిస్థితి లేదు...

పేద, మధ్య తరగతి ప్రజలు కరెంట్​ బిల్లులను కట్టే పరిస్థితి లేదని శ్రీధర్​రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్​ పనితీరు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని హితవుపలికారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే.. ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details