మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్‌కు చెందిన బోడ రాము, జమాండ్లపల్లికి చెందిన మోహన్ అనే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై మహబూబాబాద్ నుంచి మరిపెడకు వెళ్తున్నారు. ఎల్లంపేట శివారు సోమ్లాతండా వద్ద మరిపెడ నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న ఆటో అదుపు తప్పి వీరి బైక్‌ని ఢీ కొట్టింది. రాము కాలు తెగి రోడ్డుపై పడిపోయింది. స్థానికులు క్షత్రగాత్రులను మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు.
బైక్‌ను ఢీ కొట్టిన ఆటో... ఇద్దరికి తీవ్ర గాయాలు - bike auto accident at ellampeta
ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగి రోడ్డుపై పడిపోయింది.
బైక్‌ను ఢీ కొట్టిన ఆటో... ఇద్దరికి తీవ్ర గాయాలు