విపత్కర సమయంలో నిరుపేదలు, వలస కూలీలకు సహాయం చేయటం ఆ ప్రభువు మాకిచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని బిలీవర్స్ చర్చి ఫాదర్ ఏ. రెవరెండ్ ప్రేమానందం పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న సంచార జాతులకు చెందిన 50 మంది కూలీలకు బిలీవర్స్ చర్చి ఫాదర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలంతా లాక్డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన బిలీవర్స్ చర్చి ఫాదర్ - మహబూబాబాద్ జిల్లాలో బిలీవర్స్ ఆధ్వర్యంలో సంచార జాతి కూలీలకు నిత్యావసరాలు పంపిణీ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న సంచార జాతి కూలీలకు పట్టణంలోని బిలీవర్స్ చర్చి ఫాదర్ ఏ.రెవరెండ్ ప్రేమానందం నిత్యావసరాలను అందజేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన బిలీవర్స్ చర్చి ఫాదర్