మహబూబాబద్ జిల్లా బయ్యారం మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి బుధవారం కరోనా సోకింది. చికిత్స నిమిత్తం అతడిని మహబూబాబాద్ ప్రభుత్వ వైద్యశాలలోని కొవిడ్ వార్డుకు తరలించారు. అతను చికిత్స పొందుతూ ఆ రాత్రే మరణించారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు గురువారం ఉదయం వరకు కుటుంబసభ్యులెవరూ రాకపోవడం వల్ల ఆసుపత్రి సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు తెలియజేశారు.
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేయవద్దంటూ ఆందోళన - కరోనా మృతదేహానికి అంత్యక్రియలు అక్కడ చేయవద్దంటూ ఆందోళన
కరోనాతో మృతి చెందిన వేరే గ్రామానికి చెందిన మృతదేహాన్ని మా కాలనీలో అంత్యక్రియలు నిర్వహించవద్దని స్థానికులు ఆందోళన చేపట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. చేసేదేమీ లేక మృతదేహాన్ని బయ్యారం అటవీప్రాంతానికి పోలీసులు తరలించారు.
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు అక్కడ చేయవద్దంటూ ఆందోళన
సమాచారమందుకున్న బయ్యారం పోలీసులు మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్ శివారులో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా.. కాలనీవాసులంతా ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. చేసేదేమీ లేక ఆ మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి తర్వాత బయ్యారం అటవీ ప్రాంతానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం