నిషేధించబడిన గుట్కా, అంబర్ ప్యాకెట్లను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారన్న సమాచారంతో మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మూడు దుకాణాల్లో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.22 వేల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లు పోలీసుల దాడిలో దొరికాయి.
గుట్టు చప్పుడు కాకుండా.. గుట్కా అమ్ముతున్నారు! - Banned Gutkha Seized In Mahaboobabad
మహబూబాబాద్ జిల్లాలో దొంగచాటుగా నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లను అమ్ముతున్న వ్యాపారులను పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.
![గుట్టు చప్పుడు కాకుండా.. గుట్కా అమ్ముతున్నారు! Banned Gutkha Seized In Mahaboobabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6447033-150-6447033-1584468670588.jpg)
గుట్టు చప్పుడు కాకుండా.. గుట్కా అమ్ముతున్నారు!
దాడుల్లో పాల్గొన్న సీఐ రవికుమార్ వ్యాపారస్తులను గతంలో చాలాసార్లు హెచ్చరించినా వినకుండా అక్రమంగా అమ్ముతున్నట్టు తెలిపారు. వ్యాపారుల మీద కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నట్టు చెప్పారు. మరోసారి అక్రమంగా నిషేధిత గుట్కా అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
గుట్టు చప్పుడు కాకుండా.. గుట్కా అమ్ముతున్నారు!
ఇదీ చూడండి :కరోనాతో నర్సుల యుద్ధం..మృత్యువుతోనే పోరాటం..