Bandi Sanjay on HM death: రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన బదిలీల నేపథ్యంలో... వేరే జిల్లాకు బదిలీ అయ్యాననే మనస్తాపంతో ఓ ప్రధానోపాధ్యాయుడు మరణించిన ఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది. సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ అవడంతో జేత్రాం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు.
'ప్రధానోపాధ్యాయుడి మరణం.. కచ్చితంగా ప్రభుత్వ హత్యే..' - ప్రధానోపాధ్యాయుడి మృతిపై బండి సంజయ్ రియాక్షన్
Bandi Sanjay on HM death: పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది. జేత్రాం మరణం పట్ల ఎంపీ బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
!['ప్రధానోపాధ్యాయుడి మరణం.. కచ్చితంగా ప్రభుత్వ హత్యే..' Bandi Sanjay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14055990-thumbnail-3x2-bandi.jpg)
జేత్రాం మరణం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే జేత్రాం మరణానికి కారణమని ఆరోపించారు. తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గృహనిర్బంధం