తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్రీడమ్ రన్​కు జెండా ఊపారు..!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్​ను జిల్లా కలెక్టర్ గౌతం, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి పౌరుడు స్వాతంత్య్ర పోరాట చరిత్రను స్మరించుకుంటూ.. అమరుల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

Azadika Amrit Mahotsava is celebrated in Mahabubabad district
ఫ్రీడమ్ రన్​కు జెండా ఊపారు..!

By

Published : Mar 24, 2021, 9:55 AM IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలను పురస్కరించుకుని.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్​ను జిల్లా కలెక్టర్ గౌతం, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.

స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ఫ్రీడం రన్ కొనసాగింది. స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతివారం ఒక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పౌరుడు స్వాతంత్య్ర పోరాట చరిత్రను స్మరించుకుంటూ.. దాని అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి:అనారోగ్యంతో ఒకరు.. బలవన్మరణంతో మరొకరు

ABOUT THE AUTHOR

...view details