తెలంగాణ

telangana

పెద్దముప్పారంలో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎంపీ కవితలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Dec 20, 2020, 6:50 AM IST

Published : Dec 20, 2020, 6:50 AM IST

ayyappa maha padipooja at pedda mupparam in mahabubabad district
పెద్దముప్పారంలో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బతుకమ్మ ఘాట్ వద్ద జడ్పీ వైస్ ఛైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​, ఎంపీ కవిత పాల్గొన్నారు. 18వ మహా పడిపూజ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప దీక్షా స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

మహా పడిపూజ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు గణనాథుడి వేషధారణతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పెద్దముప్పారంలో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

పండుగలప్పుడు ఈ రూట్లకే ప్రత్యేక రైళ్ల సదుపాయం..

ABOUT THE AUTHOR

...view details