తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై అవగాహనకు చిందు కళాబృందం ప్రదర్శన

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చిందు కళాకారులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. వీధుల్లో అకారణంగా తిరుగుతూ ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ సూచించారు.

వినూత్న రీతిలో కరోనాపై అవగాహన
వినూత్న రీతిలో కరోనాపై అవగాహన

By

Published : May 2, 2020, 3:54 PM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో భాస్కర్ చిందు కళాబృందం ఆధ్వర్యంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. యమ ధర్మరాజు, చిత్ర గుప్తుడు, కరోనా వైరస్ వేషధారణలతో స్థానికులను అలరింపజేశారు. వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారంటూ వేషధారణలతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు..కరోనా నియంత్రణ కు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ గౌరీశంకర్, ఎస్సై వెంకన్న, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details