మహిళపై భర్త, ఆడపడుచులు, అత్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్తండాలో చోటుచేసుకుంది. కురవి మండలం పెద్ద తండాకు చెందిన భద్రమ్మకు, లైన్ తండాకు చెందిన సూర్యతో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచు ఘర్షణలు జరుగుతుండడం వల్ల పెద్దమనుషుల సమక్షంలో ఇరువురు విడిపోయారు. భరణం కింద మూడు లక్షల రూపాయలను 45 రోజుల్లో భద్రమ్మకు చెల్లిస్తానని సూర్య ఒప్పందం చేసుకున్నాడు.
'భరణం అడిగినందుకు భార్యపై దాడి' - మహబూబాబాద్ జిల్లాలో భార్యపై దాడి చేసిన భర్త
భార్యభర్తలు విడిపోయారు. భార్యకు భరణం చెల్లిస్తానని పెద్ద మనుషుల సమక్షంలో భర్త ఒప్పుకున్నాడు. 45 రోజులు అవుతున్నా.. భరణం చెల్లించకపోవడం వల్ల భర్త ఇంటికి వెళ్లిన భార్యపై కుటుంబ సభ్యులతో కలిసి దాడికి దిగాడు.
భార్యపై దాడి
45 రోజులు దాటిపోయినా, మూడు లక్షల రూపాయలు చెల్లించకపోవడం వల్ల, భద్రమ్మ.. సూర్య ఇంటికి వెళ్ళింది. రూ. 3 లక్షలు ఇచ్చేంత వరకు ఇంట్లోనే ఉంటానని తెలిపింది. సూర్య మరో ఐదుగురు కుటుంబ సభ్యులు భద్రమ్మపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..
TAGGED:
భార్యపై దాడి చేసిన భర్త