అటవీశాఖ అధికారిణిపై జరిగిన దాడిని నిరసిస్తూ... మహబూబాబాద్‌లో అటవీశాఖ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. వివేకానంద కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే 20 హెక్టార్లలో హరితహారం చేపట్టేందుకు వాహనాలతో వెళ్లిన అటవీశాఖ అధికారులపై ప్రజా ప్రతినిధి కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు, అతని అనుచరులు దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళా అధికారి అని చూడకుండా కర్రలతో దాడి చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు.
మహిళా అధికారిపై దాడి హేయమైన చర్య - forest officer
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాలా అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ మహబూబాబాద్‌లో అటవీ శాఖ సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇది ఒక హేయమైన చర్యగా అధికారులు అభిప్రాయపడ్డారు.
మహిళా అధికారిపై దాడి హేయమైన చర్య