మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తరువాత అన్ని కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే మార్గాల్లో 5, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 12 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా రహదారుల పైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో 9 గంటల నుంచి 10 గంటల సమయంలో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది.
పటిష్ఠంగా లాక్డౌన్.. అమలును పరిశీలించిన ఏఎస్పీ - మహబూబాబాద్‌లో లాక్డౌన్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఏఎస్పీ యోగేష్ గౌతం పరిశీలించారు. ఉదయం 10 తర్వాత బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1000 వాహనాలను సీజ్ చేశారు.
10 గంటల తరువాత కూడా తెరిచి ఉన్న దుకాణాలకు జరిమానాలు విధిస్తున్నారు. మహబూబాబాద్ పట్టణంలో లాక్డౌన్ పరిస్థితిని ఏఎస్పీ పరిశీలించారు. పలు కూడళ్లలో స్వయంగా వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000కి పైగా వాహనాలను సీజ్ చేశారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని.. 10 తర్వాత రహదారుల పైకి ఎవరు రావద్దని ఏఎస్పీ సూచించారు. అనుమతులు ఉన్నవారు, అనారోగ్యంతో ఇబ్బందులు పడే వారు మాత్రమే రావాలని, లేనిపక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:అతివేగంగా వచ్చి.. కారును ఢీకొట్టి..!