కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్న తమకి పనికి తగ్గ వేతనాలు రావడం లేదని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో దాదాపు గా 83 మంది ఆశావర్కర్లు ఉన్నారు. కరోనా మొదలయినప్పటి నుంచి తాము విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజల ఆరోగ్యాల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నామన్నారు. కానీ తమ కష్టానికి తగ్గ వేతనాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు నెలకు రూ.7,200 వేతనం వస్తుందని కానీ ఆ జీతంతో తమ కుటుంబాలు గడవాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు చొరవ చూపి త్వరగా వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.