తెలంగాణ

telangana

ETV Bharat / state

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు - etv bharath

అభివృద్ధి పనుల కోసం భూమిని చదును చేస్తుంటే పురాతన విగ్రహాలు బయటపడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో జరిగింది. కాలనీ వాసులంతా ఆ విగ్రహాలను ఓ చోట ప్రతిష్ఠించి జలాభిషేకం చేశారు.

Ancient statues find at gopalapuram village in mahabubabad district
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు

By

Published : Sep 23, 2020, 10:07 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో భూమిని చదును చేయిస్తున్నారు. ఇంతలో ఓ చోట పురాతన నంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు బయటపడ్డాయి.

కాలనీ వాసులంతా ఆ విగ్రహాలను ఓ చోట ప్రతిష్ఠించారు. జలాభిషేకం చేసి... భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పురాతన కాలంలో అవి బయటపడిన చోట దేవాలయాలు ఉండేవని తమ పూర్వీకులు చెప్పారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం సహాయ సహకారాలతో ఇక్కడ గుడి నిర్మించేందుకు కాలనీ వాసులంతా కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు

ABOUT THE AUTHOR

...view details