రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల సామాగ్రిని నిల్వ చేసిన సాంఘీక సంక్షేమ బాలికల కళాశాలను ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. పోలింగ్ బాక్సులను, ఇతర సామాగ్రిని పరిశీలించారు.
జిల్లాలోని 36, 633 ఓటర్లకు.. 53 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రక్రియ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగుతుందని వివరించారు.