తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి' - ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రాలు తాజావార్త

ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని డోర్నకల్‌ శాసన సభ్యుడు రెడ్యానాయక్‌ కోరారు. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

agros-raitu-seva-centre-inagurated-by-mla-redyanaik-in-mahabubabad
'ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి'

By

Published : Sep 21, 2020, 10:23 AM IST

మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్​ ప్రారంభించారు. సేవా కేంద్రంలో ఆయన స్వయంగా మందులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'పల్లె, పట్టణ ప్రగతి అమలులో రెండో స్థానంలో నిజామాబాద్'

ABOUT THE AUTHOR

...view details