మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధునాతన సౌకర్యాలతో కూడిన ఆంబులెన్స్‌ను ఎంపీ కవిత ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆధునిక వైద్యం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఆమె తెలిపారు. ఆంబులెన్స్ సౌకర్యం లేక దాదాపు 20 ఏళ్లుగా మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ పేర్కొన్నారు.
మారుమూల ప్రాంతాలకు ఆధునాతన ఆంబులెన్స్ సేవలు: ఎంపీ కవిత - మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ కవిత
వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలను అందించేందుకు ఆంబులెన్స్ బహుకరిస్తున్నామని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంబులెన్స్ సేవలను ఆమె ప్రారంభించారు.
మారుమూల ప్రాంతాలకు ఆధునాతన ఆంబులెన్స్ సేవలు : ఎంపీ కవిత
'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమంలో భాగంగా రూ.21 లక్షల ఎంపీ నిధులతో కొనుగోలు చేసినట్లు కవిత వెల్లడించారు. ఆంబులెన్స్ అందుబాటులోకి రావడంతో మండల ప్రజల సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆంబులెన్స్‌ను నడపుతూ ఎంపీతో కలిసి కొద్దిదూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి గౌతమ్, వైద్యాధికారులు, తెరాస నాయకులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.