ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈదుల పూసపల్లి దర్గా తండాకు చెందిన హర్యా నాయక్, శేషయ్య, లవ్యాలు ద్విచక్ర వాహనంపై వెళ్తూ... ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. హర్యా నాయక్ అక్కడికక్కడే మృతిచెందగా, శేషయ్య, లవ్యాలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
లారీ,ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - bike
ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది.
లారీ,ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు