తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న కారు... ఒకరు మృతి - accident

దంతాపల్లిలో రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి.

చెట్టును ఢీకొట్టిన కారు

By

Published : May 30, 2019, 10:52 AM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో విషాదం జరిగింది. సూరత్​కు చెందిన నలుగురు స్థానికంగా జరిగిన వివాహ వేడుకకు హాజరై కారులో వెనుతిరిగారు. రహదారిపై ఏర్పడిన గుంతను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మిగిలిన వారికి తీవ్రగాయలయ్యాయి. మృతుడు కోట విజయ్​గా గుర్తించారు. గాయపడిన వారిని తొర్రూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టును ఢీకొట్టిన కారు

ABOUT THE AUTHOR

...view details