మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురంలో విషాదం జరిగింది. తేలు కాటుతో పదిహేనేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మల్లం నవీన్ దంతాలపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి సమయంలో ఇంటి వద్ద తేలు కరిచించి. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని తొర్రూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాలుడి మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.
తేలు కాటుతో విద్యార్థి మృతి - తేటు కాటుతో విద్యార్థి మృతి
తేలుకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురంలో చోటు చేసుకుంది.

తేటు కాటుతో విద్యార్థి మృతి
TAGGED:
తేటు కాటుతో విద్యార్థి మృతి