తెలంగాణ

telangana

ETV Bharat / state

'కలాంను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి' - విద్యావేత్త చుక్కా రామయ్య

విద్యార్థుల్లో మానసిక మార్పు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ ఒక అబ్దుల్​ కలాంలాగా తయారవుతారని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో వందేమాతరం ఆధ్వర్యంలో నిర్వహించిన కలాం వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

అబ్దుల్​ కలాం

By

Published : Jul 27, 2019, 11:41 PM IST

తొర్రూరులో అబ్దుల్​ కలాం వర్ధంతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఎస్​సీఈఆర్​టీ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు అబ్దుల్​కలాంను ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు. వారిలో మానసికంగా మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి చెందుతారని అభిప్రాయపడ్డారు.

శాస్త్రవేత్తలుగా ఎదగాలి

విద్యార్థులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా శ్రమించాలని వక్తలు సూచించారు. అబ్దుల్​కలాంను స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తల స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి : త్వరలో మహబూబాబాద్​కు ఫార్మా కంపెనీ!

ABOUT THE AUTHOR

...view details