young man died today while getting married tomorrow in mahabhubabad : విధి ఎంత విచిత్రమైందంటే కొన్ని సార్లు మన కళ్లముందు జరిగిన సంఘటనలు.. వాస్తవమేనా అన్న అనుమానం వస్తుంది. తెల్లవారితే పెళ్లి.. బంధువులతో ఇల్లంతా కోలహాలంగా ఉంది. అందరూ పెళ్లి పనులలో నిమగ్నమైపోయారు. ఇంతలోనే మృత్యుదేవత కరెంట్ రూపంలో వచ్చింది. పెళ్లికొడుకు బోర్ మోటర్ మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుతాఘాతంతో మృతి చెందాడు.
మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా యాకుబ్(23) కు గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మే 12న వివాహం జరగవలసి ఉంది. మే 11వ తేదీన ఇంట్లో బోరు బావి చెడిపోవడంతో యాకుబ్ మోటర్‌కు మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుతాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అంతా అవాక్కయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
married junior doctor committed suicide due to dowry harassment in hanmakonda : హనుమకొండ జిల్లాలో అదనపు వరకట్నం వేధింపులకు తాళలేక ఓ జూనియర్ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడింది. యువ వైద్యురాలు కుందూరు నిహారిక(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఎంజీఎం వరంగల్‌లో ఫిజియోథెరపిస్టుగా విధులు నిర్వర్తిస్తోంది.