మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడ గ్రామంలో తేజావత్ జ్యోతి(31) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో తలపై బలమైన గాయాలతో ఆమె విగతజీవిగా పడి ఉంది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం
అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం
మృతదేహం సమీపంలో ధ్వంసమైన ఓ ద్విచక్ర వాహనం ఉంది. అటుగా వెళ్తున్న గ్రామస్థులు జ్యోతి మృతదేహాన్ని గమనించిన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!