మహబూబాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలో నెల రోజుల ప్రణాళిక అమలులో భాగంగా విద్యుత్ శాఖ హెల్పర్‌కు విద్యుదాఘాతం సంభవించి ప్రాణాలో కొట్టుమిట్టాడుతున్నాడు. చిన్నగూడూరు మండలం మన్నెగూడెంలో విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న కుర్రె సోమయ్య స్తంభంపై పనిచేస్తుండగా.. విద్యుదాఘాతం సంభవించి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సోమయ్యను ఖమ్మంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం సోమయ్య పరిస్థితి విషమంగా ఉందని..అప్పు చేసి వైద్యం చేయిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మెరుగైన చికిత్సను అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
హెల్పర్‌కు విద్యాదాఘాతం..ప్రాణాలతో పోరాటం.. - మహబూబాబాద్
నెల రోజుల ప్రణాళిక అమలులో ఓ ఔట్ సోర్సింగ్ కార్మికుడికి విద్యుదాఘాతం సంభవించి తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రాణాలతో పోరాటం..