తెలంగాణ

telangana

ETV Bharat / state

గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి.. 15 గొర్రెలు మృతి - గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాంచంద్రాపురం కాలనీలోని గొర్రెల మందపై కుక్కల గుంపు తీవ్రంగా దాడి చేశాయి. ఘటనతో పదిహేను గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 5 గొర్రెలు గాయాలపాలయ్యాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు వేడుకున్నారు.

గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి.. 15 గొర్రెలు మృతి
గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి.. 15 గొర్రెలు మృతి

By

Published : Sep 18, 2020, 10:43 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాంచంద్రాపురం కాలనీలో గొర్రెల మందపై కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేశాయి. పదిహేను గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 5 గొర్రెలు గాయాలపాలయ్యాయి.

రూ.లక్ష నష్టం..

ఘటనతో సుమారు లక్ష రూపాయల విలువ చేసే జీవాలు చనిపోయాయని బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. తమ జీవనోపాధికి వేరే దారి లేదని... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. లేని పక్షంలో రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : విశ్వకర్మలకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాం: శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details